శాంసంగ్ ఫోల్డబుల్స్‌కు రికార్డు స్పందన.. 72 గంటల్లో 2.71 లక్షల ప్రీ-ఆర్డర్లు!

Samsung foldable phones record 271 lakh pre-orders in 72 hours
  • మొత్తం ఆర్డర్లలో 45 శాతం టైర్-2 నగరాల నుంచే
  • గతేడాది 15 రోజుల రికార్డును మూడు రోజుల్లోనే అధిగమించిన వైనం
  • భారతీయ అవసరాలకు అనుగుణంగా తయారీ అని చెప్పిన కంపెనీ

భారత మార్కెట్లో శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్8, గెలాక్సీ Z ఫ్లిప్8 మోడళ్లకు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైన కేవలం 72 గంటల్లోనే 2.71 లక్షలకు పైగా బుకింగ్స్ నమోదైనట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి అని శాంసంగ్ పేర్కొంది.

గతేడాది గెలాక్సీ Z ఫోల్డ్7, ఫ్లిప్7 మోడళ్లకు ఇదే స్థాయిలో ప్రీ-ఆర్డర్లు రావడానికి 15 రోజులు పట్టగా, ఈసారి ఆ రికార్డును కేవలం మూడు రోజుల్లోనే అధిగమించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ప్రీ-బుకింగ్స్‌లో సుమారు 45 శాతం వాటా టైర్-2, ఆ తర్వాతి శ్రేణి నగరాల నుంచే రావడం గమనార్హం. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఫోల్డబుల్ టెక్నాలజీకి ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం.

ఈ స్పందనపై శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జేబీ పార్క్ మాట్లాడుతూ, భారతదేశంలో వినూత్న సాంకేతికతకు లభిస్తున్న ఆదరణకు ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. "ఈ ఫోన్లు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులు మాత్రమే కాకుండా, భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇక్కడి ఆర్ అండ్ డీ కేంద్రాల్లోనే వీటిని అభివృద్ధి చేశాం. చిన్న నగరాల నుంచి వ్యక్తమవుతున్న ఆసక్తి భవిష్యత్ వృద్ధికి శుభసూచకం" అని ఆయన వివరించారు.
Advertisement
Samsung
Samsung Galaxy Z Fold8
Samsung Galaxy Z Flip8
Foldable smartphones India
Samsung pre-order record

More Telugu News