ఆమెతో అలా పరిచయం.. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్
- లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు
- కేసు వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
- నిందితుడు గతంలో కానిస్టేబుల్‌గా పని చేసినట్లు వెల్లడి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు అరెస్టయిన అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్‌వీపీఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా అధికారిణి జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, అసభ్యకర సందేశాలు పంపాడని, కత్తితో బెదిరించి, గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. తన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు. బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె మెడ, బుగ్గలపై గాయాలున్నట్లు నిర్ధారణ అయింది.
నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించినట్లు సజ్జనార్ వెల్లడించారు. యూపీఎస్సీలో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన అతను, 2025 డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నాడని తెలిపారు. అదే ఏడాది మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో నిందితుడికి పరిచయం ఏర్పడినట్లు వివరించారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కు ఎంపికైన తన విజయప్రస్థానంపై ఉదయ్ కృష్ణారెడ్డి పెట్టిన పోస్టుకు బాధితురాలు స్పందించడంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో, తాను 2024 బ్యాచ్ ఐపీఎస్‌కు ఎంపికయ్యానని, ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌లో ఉన్నందున 2025 బ్యాచ్‌తో కలిసి శిక్షణ తీసుకోనున్నట్లు బాధితురాలు నిందితుడికి తెలియజేసినట్లు వెల్లడించారు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, తదనంతరం ప్రేమకు దారితీసిందని సజ్జనార్ పేర్కొన్నారు.
శిక్షణ సమయంలో వీరి మధ్య బంధం బలపడినప్పటికీ, కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని తెలిపారు. నిందితుడి పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా, బాధితురాలి ల్యాప్‌టాప్‌ను విసిరికొట్టి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు తనను బ్లాక్ చేయడంతో, నిందితుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి వ్యక్తిగత చాట్ వివరాలను బహిర్గతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని సజ్జనార్ తెలిపారు. వేధింపులు భరించలేక బాధితురాలు అతడికి దూరంగా జరిగి మరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ, నిందితుడి వేధింపులు కొనసాగడంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.