'ఇంటింటికి తెలుగుదేశం'.. మూడో రోజూ జోరుగా కొనసాగిన కార్యక్రమం

Telugu Desam Party Intintiki Telugu Desam program continues vigorously on third day
  • మూడో రోజూ విజయవంతంగా "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం
  • మూడు రోజుల్లో 6.20 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ నేతలు
  • సాంకేతిక పరిజ్ఞానంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నారా లోకేశ్
  • కుప్పంలో పర్యటించి మహిళల సమస్యలు తెలుసుకున్న భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం–2026' కార్యక్రమం మూడో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగింది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో కలిపి మొత్తం 6.20 లక్షల కుటుంబాలను పార్టీ శ్రేణులు నేరుగా కలిసినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరూ భాగస్వాములయ్యారు. మూడో రోజున సుమారు 2.60 లక్షల ఇళ్లను సందర్శించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలైన ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని 98.5 శాతం క్లస్టర్లలో ఈ కార్యక్రమం జరిగిందని, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో విశేష స్పందన లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

కార్యక్రమ పురోగతిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేతలకు సూచనలు ఇస్తున్నారు.

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడో రోజు కూడా పర్యటించారు. వసనాడు, వేపూరు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరిస్తూ, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు.
Advertisement
Telugu Desam Party
Intintiki Telugu Desam
Nara Lokesh
Nara Bhuvaneshwari
Andhra Pradesh Politics
TDP Welfare Schemes

More Telugu News