బెంగాల్‌లో భాజపా మార్క్.. ‘బిశ్వ బంగ్లా’ లోగో స్థానంలో ‘అశోక చిహ్నం’
- సాల్ట్ లేక్ స్టేడియంలో మారిన బోర్డు
- కాషాయ రంగులోకి ప్రభుత్వ పోర్టల్స్
- కొత్త పోర్టల్‌లో సీఎం సువేందు అధికారి ఫొటో
- వ్యక్తి రూపొందించిన లోగో ఉండొద్దని నేతల సమర్థన
పశ్చిమ బెంగాల్‌లోని భాజపా ప్రభుత్వం అధికారిక వేదికల నుంచి ‘బిశ్వ బంగ్లా’ లోగోను తొలగించడం ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ లోగో స్థానంలో భారత జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తోంది.
కోల్‌కతాలోని ప్రముఖ సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డును తొలగించి అశోక చిహ్నాన్ని పెట్టారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు, సేవలను అనుసంధానించే ‘ఎగియే బంగ్లా’ పోర్టల్‌లో కూడా అశోక చిహ్నాన్ని ఉంచారు. గతంలో ఉన్న తెలుపు, నీలం రంగుల థీమ్‌ను మార్చి కాషాయ రంగును చేర్చారు. బెంగాలీ అక్షరం ‘బ’ ఆధారంగా రూపొందించిన ఈ బ్రాండ్ 2013 సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. బెంగాల్ సంస్కృతి, పర్యాటకం, హస్తకళలకు ప్రతీకగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని విస్తృతంగా వాడింది.
ప్రస్తుతం అప్‌డేట్ చేసిన పోర్టల్‌లో అశోక చిహ్నంతో పాటు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫొటోను పెట్టారు. పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయ శాఖల ఐకాన్లను కాషాయ రంగు గ్రాఫిక్స్‌తో రీడిజైన్ చేశారు. ఒక వ్యక్తి రూపొందించిన లోగో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రగా ఉండొద్దంటూ భాజపా నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.