బెంగాల్‌లో ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించా: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

CJI hails record voter turn out in West Bengal polls
  • 'ఎస్ఐఆర్' కేసు విచారణ సందర్భంగా పోలింగ్ శాతంపై సుప్రీంకోర్టు స్పందన
  • పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై ప్రశంసలు
  • ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయడం ఆనందంగా ఉందన్న సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో పోలింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు. భారత పౌరుడిగా బెంగాల్‌లో జరిగిన ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించానని వ్యాఖ్యానించారు. బెంగాల్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అలాగే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.

శుక్రవారం 'ఎస్ఐఆర్' కేసు విచారణ సందర్భంగా పోలింగ్ శాతంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై ప్రశంసలు కురిపించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడం, ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని వ్యాఖ్యానించింది. ప్రజలు తమ ఓటుకు ఉన్న శక్తిని తెలుసుకుంటే ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడబోరని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. 

కాగా, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్ శాతం ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్‌లో మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరగగా, ఓటింగ్ శాతం 92 శాతం దాటింది. దక్షిణ్ దినాజ్‌పూర్, కూచ్ బెహార్‌, బీర్‌బుమ్ జిల్లాల్లో ఓటింగ్ శాతం 95 శాతానికి పైగా నమోదైంది.
Go Back to Shorts
CJI hails record voter turn out in first phase of West Bengal polls
West Bengal polls

More Telugu News