రూ. 250 కోట్లు కావాలంటున్న సంగీత.. రూ. 35 కోట్లు ఇస్తానంటున్న విజయ్!
- కీలక దశకు చేరుకున్న నటుడు విజయ్, సంగీత విడాకుల వ్యవహారం
- భరణంగా రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న సంగీత
- నేటి విచారణకు ఆన్‌లైన్‌లో హాజరుకానున్న విజయ్
- ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్
- ఆస్తి సెటిల్‌మెంట్‌పై ఇరువర్గాల మధ్య కొలిక్కిరాని చర్చలు
తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఆస్తి పంపకాలపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసు సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మధ్య భరణం అంశం ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సంగీత తనతో పాటు కుమారుడు, కుమార్తె భవిష్యత్తు కోసం భరణంగా సుమారు రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల ఆధారంగా ఆమె ఈ మొత్తాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, విజయ్ మాత్రం రూ. 35 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని, పిల్లల పూర్తి బాధ్యతను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారని సమాచారం. ఈ సెటిల్‌మెంట్‌పై శనివారం ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
నేటి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని విజయ్ తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 17నే కోర్టుకు విన్నవించారు. మరోవైపు, విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు చెన్నై నీలాంగరైలోని తమ నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దాదాపు 25 ఏళ్ల వైవాహిక బంధం ఇలా ముగింపు దశకు రావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. రాజకీయాల్లో కీలక అడుగులు వేస్తున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ పరిణామాలు తమిళనాట సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.