ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గౌరవం
- ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫెలోషిప్‌కు ఎంపికైన నాగేశ్వర్‌రెడ్డి
- ప్రపంచంలోని టాప్-2 శాతం నిపుణుల్లో స్థానం
- స్వదేశీ ఆవిష్కరణలు జరగాలన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీని కేవలం నిర్ధారణ పరికరం స్థాయి నుంచి శక్తిమంతమైన చికిత్సా సాధనంగా మార్చిన వ్యక్తిగా డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన ఆవిష్కరణల్లో ఒకటైన 'నగి స్టెంట్', గ్యాస్ట్రోఇంటెస్టినల్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
ఈ గుర్తింపు పట్ల డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, ఇది తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. "ప్రస్తుతం మనం వైద్య రంగంలో కీలక మార్పుల దశలో ఉన్నాం. క్లినికల్ అనుభవం, ఇంజనీరింగ్ నైపుణ్యం, కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యాలను ఉపయోగించి స్వదేశీ వైద్య సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. దీని ద్వారా భారత్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల విధానాన్ని మార్చగలం" అని ఆయన పేర్కొన్నారు. పరిశోధనలకు సరైన పెట్టుబడులు, మద్దతు లభిస్తేనే ఆవిష్కరణల ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అభిప్రాయపడ్డారు.