- ఒక్క బీపీ డోసు మిస్ అయితే రక్తపోటు తాత్కాలికంగా పెరిగే ఛాన్స్
- తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం
- తరచూ మందులు మిస్ అయితే గుండెపోటు, పక్షవాతం ముప్పు
- మిస్ అయిన మాత్రకు బదులుగా రెండు డోసులు వేసుకోవద్దంటున్న నిపుణులు
- తదుపరి డోసు సమయం దగ్గరైతే వైద్య సూచనలు పాటించాలని సూచన
అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ నిర్ణీత సమయంలో మందులు వేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, బిజీ జీవితంలో ఒక్కోసారి మాత్ర వేసుకోవడం మరిచిపోతుంటారు. ఒక్క డోసు మిస్ అయితే వెంటనే ప్రమాదం ముంచుకొస్తుందా? తరచూ మందులు వేసుకోవడం మరిచిపోతే గుండెకు ముప్పు పెరుగుతుందా? వైద్య నిపుణులు సూచించే జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఒక్క మాత్ర మిస్ అయితే..
బీపీ మందును ఒక్కసారి వేసుకోవడం మరిచిపోతే రక్తపోటు తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. అయితే, లక్షణాలు లేవని రక్తపోటు అదుపులోనే ఉందని భావించకూడదు.
తరచూ మరిచిపోతే ముప్పే!
బీపీ మందులను పదేపదే మిస్ కావడం వల్ల రక్తపోటు నియంత్రణ తప్పవచ్చు. దీర్ఘకాలంలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యం, మూత్రపిండాల సమస్యల ముప్పు పెరగవచ్చు. అధిక రక్తపోటు ఉన్నా చాలామందికి బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మాత్ర మరిచిపోతే ఏం చేయాలి?
మాత్ర వేసుకోవడం మరిచిపోయినట్లు గుర్తొస్తే.. ముందుగా ఆ మందుకు సంబంధించిన సూచనలు పరిశీలించాలి. తదుపరి డోసు సమయం దగ్గరగా ఉంటే మిస్ అయిన మాత్రను వదిలేయాల్సి రావచ్చు. ఒకేసారి రెండు డోసులు వేసుకోకూడదు. ఏం చేయాలనే విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించాలి. వరుసగా కొన్ని రోజులు మందులు తీసుకోకపోయినా వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు
తీవ్రమైన ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, శరీరంలో ఒకవైపు బలహీనత, చూపులో మార్పులు లేదా మాట్లాడటంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే అత్యవసర వైద్యసాయం పొందాలి. బీపీ మందులను సొంత నిర్ణయంతో ఆపడం లేదా మోతాదు మార్చడం ప్రమాదకరం.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. దీంట్లోని సమాచారాన్ని వైద్యుల సలహాలు, సూచనలుగా ఎట్టిపరిస్థితుల్లో భావించొద్దు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.