బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

Nitish Kumar Resigns as Bihar Chief Minister
  • లోక్‌భవన్ చేరుకుని గవర్నర్‌కు రాజీనామా అందజేత
  • మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడి
  • రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్ చేరుకున్న ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. నితీశ్ కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటు చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్‌కు తెలియజేశారు.

నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా పలువురు బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో తొలిసారి ఆ పార్టీ ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
Go Back to Shorts
Nitish Kumar
Bihar
Bihar Chief Minister
JDU
Resignation
Samrat Choudhary
Nityanand Rai
Bihar Politics
BJP

More Telugu News