- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘన విజయం
- కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్న పెమ్మసాని
- వైసీపీ హయాంలోని అరాచకాలకు, నేటి ప్రజాస్వామ్య ఎన్నికలకు తేడా ఇదేనని వ్యాఖ్య
- ఈవీఎంలపై వైసీపీది తప్పుడు ప్రచారం అని, బ్యాలెట్తోనూ ప్రజలు తిరస్కరించారని వెల్లడి
- రెండున్నరేళ్లలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళుతోందని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర, అరాచక పాలనను ప్రజలు తమ ఓటుతో నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, కూటమి ప్రభుత్వ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గెలుపు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల సమష్టి నాయకత్వంపై ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని పెమ్మసాని వివరించారు. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వికలాంగులకు అందిస్తున్న రూ.4,000, రూ.6,000 పెన్షన్లు, 'తల్లికి వందనం', 'దీపం', 'అన్నదాత సుఖీభవ' వంటి పథకాల ద్వారా సుమారు రూ.1,50,000 కోట్ల సంక్షేమాన్ని నేరుగా ప్రజలకే అందించామని తెలిపారు.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ, 'రాయలసీమ రైజింగ్' వంటి కార్యక్రమాలతో యువతకు, వెనుకబడిన ప్రాంతాలకు భరోసా ఇస్తున్నామని, మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తున్నాయని కొనియాడారు.
అరాచక పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు తేడా ఇదే
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలకు, నేటి కూటమి పాలనలో జరిగిన ఎన్నికలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పెమ్మసాని ఎద్దేవా చేశారు. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం ప్రత్యర్థులపై గంజాయి, హత్యాయత్నం కేసులు పెడతామని బెదిరించి, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేస్తామని ఒత్తిడి చేసి నామినేషన్లు వేయనీయకుండా చేసిందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డులు కలిపి 1,44,000 స్థానాలకు గాను 50,000 స్థానాలను, అంటే 35 శాతం సీట్లను బలవంతంగా ఏకగ్రీవం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అత్యంత శాంతియుతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని అన్నారు. ఫలితాలు వెల్లడైన 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల, అంటే 90 శాతానికి పైగా స్థానాల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారని వెల్లడించారు.
ఈవీఎంలపై నెపం కాదు.. ప్రజల తిరస్కరణే కారణం
ఓడిపోతే ఈవీఎంలపై నెపం వేయడం వైసీపీకి అలవాటైందని పెమ్మసాని మండిపడ్డారు. 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 2024 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నేటి స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయని, అన్నింటిలోనూ వైసీపీని ప్రజలు చావుదెబ్బ కొట్టారని గుర్తుచేశారు. వైసీపీ మార్చాల్సింది మిషన్లను కాదని, ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకతను గుర్తించాలని హితవు పలికారు. ఎంతటి భావోద్వేగాలు ఉన్నా సంయమనం పాటించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని, ఆయన నాయకత్వ పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో నిలిచిపోయిన 92 కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి పట్టాలెక్కించామని పెమ్మసాని తెలిపారు. కేంద్ర సహకారంతో 3 లక్షల గ్రామీణ ఇళ్లు, 'జల్ జీవన్ మిషన్' ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి, గుంతలు పడ్డ రోడ్ల మరమ్మతులు, పోలవరం సహా 36 ప్రాజెక్టులకు రూ.35,000 కోట్లతో పనులు వేగవంతం చేశామన్నారు. జగన్ ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే, తాము 'ట్రూ-డౌన్' విధానంలో ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో మరింత కసితో పనిచేసి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతామని పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.