వైసీపీ కంచుకోట పులివెందులలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగలబోతోంది. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి తుగుట్ల గీతా కుమారి... వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా, నామినేషన్ల ప్రక్రియలోనే టీడీపీ 20 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని వైసీపీపై ఆధిక్యతను సాధించింది. మిగిలిన 20 వార్డులతో పాటు ఛైర్‌పర్సన్ పదవికి నవంబర్ 1న పోలింగ్ జరిగింది. మొత్తం 40 వార్డులకు గాను టీడీపీ 34 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. వైసీపీ కేవలం 3 వార్డుల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన వార్డులకు కౌంటింగ్ కొనసాగుతోంది.