Pakistan Gas Crisis: పాకిస్థాన్‌లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా..?
పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో అక్కడ ఎల్‌పీజీ ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా 11.67 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.3,150 నుంచి ఏకంగా రూ.5,135 స్థాయికి పెరిగింది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
గ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్‌పీజీతో నడిచే ఆటోలు, బస్సులు, మినీబస్సుల రవాణా చార్జీలు పెరగడంతో తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు, ఈద్, నౌరోజ్ సెలవుల కారణంగా ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో సంక్షోభం మరింత తీవ్రమైంది.
పాకిస్థాన్‌లో ఇంధన నిల్వలు కూడా ప్రమాదకర స్థాయిలో అడుగంటిపోయాయి. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడి చమురు, 27 రోజులకు పెట్రోల్, 21 రోజులకు డీజిల్, 9 రోజులకు ఎల్‌పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి సెనేట్ కమిటీకి తెలిపారు. పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాలలో దాదాపు 70 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత సంక్షోభం వల్ల సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి.
సరఫరాలో అంతరాయాల కారణంగా ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో రావాల్సిన 8 ఎల్ఎన్‌జీ కార్గోలలో కేవలం రెండు మాత్రమే పాకిస్థాన్‌కు చేరాయి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్‌తో పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
గమనిక: పైన తెలిపిన ధరలు పాకిస్థానీ రూపాయల్లో.