సింగపూర్‌లో పనితీరు బాగాలేదని ఉద్యోగి తొలగింపు... కంపెనీకి రూ.19 లక్షల జరిమానా!
- పనితీరు బాగోలేదంటూ ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీకి షాక్
- సింగపూర్‌లో మహిళకు అనుకూలంగా ట్రైబ్యునల్ తీర్పు
- కంపెనీ రూ.19 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం
- తొలగింపునకు సరైన కారణాలు చూపడంలో విఫలమైన యాజమాన్యం
- కంపెనీ నిబంధనలనే పాటించలేదని తేల్చిన మెజిస్ట్రేట్
సింగపూర్‌లోని ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఒక కంపెనీకి గట్టి షాక్ ఇచ్చింది. ప్రొబేషన్ కాలంలో పనితీరు సరిగా లేదనే సాకుతో ఒక మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగించినందుకు గాను, సదరు కంపెనీ ఆమెకు 30,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.19 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఉద్యోగిని తొలగింపునకు సంబంధించి సరైన ఆధారాలను చూపడంలో కంపెనీ విఫలమవ్వడంతో ట్రైబ్యునల్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. సదరు ఉద్యోగిని 2025 ఏప్రిల్‌లో ఒక కంపెనీలో ఆడిట్ మేనేజర్‌గా చేరారు. ఆమెకు ఆరు నెలల ప్రొబేషన్ కాలపరిమితి ఉంది. అయితే, ఆ గడువు ముగిసే సమయంలో ఆమె పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తనను తొలగించే ముందు ఎలాంటి రాతపూర్వక లేదా మౌఖిక హెచ్చరికలు జారీ చేయలేదని, అస్పష్టమైన ప్రమాణాలతో తన పనితీరును అంచనా వేశారని ఆమె వాదించారు.
విచారణ సందర్భంగా కంపెనీ తన వాదనలను వినిపిస్తూ, ప్రొబేషన్‌లో ఉన్న ఉద్యోగులు కనీసం 80 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుందని, కానీ ఆమె కేవలం 71 శాతం మాత్రమే సాధించారని పేర్కొంది. ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ జోయెల్ టాన్ కీలక విషయాలను గుర్తించారు. కంపెనీ నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగినికి రేటింగ్ విధానాన్ని వివరించలేదని, సరైన పనితీరు సమీక్షలు నిర్వహించలేదని సంబంధిత సూపర్‌వైజర్ అంగీకరించారు. దీంతో ఆమె తొలగింపును "ఆకస్మికమైనది మరియు అన్యాయమైనది"గా ట్రైబ్యునల్ నిర్ధారించింది.
నిబంధనల ప్రకారం ఆమెకు మూడు నెలల వేతనం కింద 34,500 సింగపూర్ డాలర్లు రావాల్సి ఉంది. అయితే, ట్రైబ్యునల్ పరిహారంపై గరిష్ఠ పరిమితి ఉండటంతో 30,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ పరిమితి లేకపోయి ఉంటే, ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడికి పరిహారంగా మరో రెండు నెలల వేతనాన్ని అదనంగా ఇప్పించేవాడినని మెజిస్ట్రేట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ తీర్పులో ఉద్యోగిని మరియు కంపెనీ వివరాలను ట్రైబ్యునల్ గోప్యంగా ఉంచింది.