Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన సందీప్ పాటిల్
- రిటైర్మెంట్‌కు ఏడాది ముందే సచిన్‌ను తప్పించాలని భావించిన బీసీసీఐ
- ఈ విషయాన్ని నేరుగా సచిన్‌కే చెప్పినట్లు వెల్లడించిన సందీప్ పాటిల్
- మీ స్థానంలో మరొకరిని చూస్తున్నామని చెప్పగానే సచిన్ షాక్ అయ్యాడన్న మాజీ చీఫ్ సెలెక్టర్
- బుమ్రా, షమీలను తెచ్చినా.. సచిన్‌ను తొలగించామన్న పేరే మిగిలిందంటూ ఆవేదన
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన విషయాలు వెల్లడించాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఏడాది ముందే, అతడిని జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ భావించిందని తెలిపాడు. ఈ విషయాన్ని నేరుగా సచిన్‌కే చెప్పినప్పుడు అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని పాటిల్ గుర్తుచేసుకున్నాడు.
24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన సచిన్, 2013లో రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, 2012లో సచిన్ ఫామ్ అంత గొప్పగా లేదు. ఆ ఏడాది ఆడిన తొమ్మిది టెస్టుల్లో కేవలం 23.80 సగటుతో ఒక్క సెంచరీ కూడా లేకుండా నిరాశపరిచాడు. వన్డేల్లోనూ అతని సగటు 31.50 మాత్రమే. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ పాటిల్, "ఆ సమయంలో నేను సచిన్‌తో మాట్లాడాను. 'మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?' అని అడిగాను. దానికి అతను 'ఎందుకు?' అని ప్రశ్నించాడు. సెలక్షన్ కమిటీ మీ స్థానంలో మరొకరిని చూస్తోందని చెప్పాను. ఆ మాట విని సచిన్ షాక్ అయ్యాడు. కొంతసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి 'మీరు చెప్పేది నిజమేనా?' అని అడిగాడు. నేను 'అవును' అని స్పష్టం చేశాను" అని ఆనాటి సంభాషణను వివరించాడు.
అయితే, సెలక్టర్లకు ఒక ఆటగాడిని బలవంతంగా రిటైర్ చేయించే అధికారం ఉండదని పాటిల్ స్పష్టం చేశాడు. "సెలక్టర్లు కేవలం ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించగలరు. కానీ, మీ కెరీర్ ముగిసిందని చెప్పలేరు. మేము అతని ప్రణాళికలు అడిగాం, అతను కొనసాగాలని కోరుకున్నాడు. మేం సరే అన్నాం" అని తెలిపాడు. చివరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సచిన్ స్వయంగా తీసుకుని తనకు తెలియజేశాడని పాటిల్ పేర్కొన్నాడు.
తన హయాంలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, మహమ్మద్ షమీ వంటి స్టార్లను జట్టులోకి తెచ్చామని, కానీ ప్రజలు ఆ విషయాలను గుర్తుంచుకోలేదని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. "ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థమైంది. అతను సచిన్ టెండూల్కర్. కానీ మేము బుమ్రా, షమీ వంటి వారిని తెచ్చాం. ఆ విషయాలు ఎవరూ మాట్లాడరు. కేవలం సచిన్‌ను మేం డ్రాప్ చేశామనే గుర్తుంచుకున్నారు" అని అన్నాడు. చివరికి సచిన్, 2013 నవంబర్ లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు.