Vijay: అమ్మాయి పెళ్లికి బంగారం, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం: విజయ్ హామీల వర్షం
- మహిళల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
- నవజాత శిశువుకు బంగారు ఉంగరం ఇస్తామని హామీ
- ప్రభుత్వ ఉద్యోగులు మినహా, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం
- ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.15 వేల ఆర్థిక సాయం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ హామీల వర్షం కురిపించారు. మహిళల కోసం అనేక వాగ్దానాలు చేశారు. తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, యువతులకు పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు మినహా, 60 సంవత్సరాల వయస్సు వరకు మహిళలందరికీ నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ వెల్లడించారు. అన్నపూరణి సూపర్ సిక్స్ పథకం కింద ఈ ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూస్తామని అన్నారు.
కామరాజర్ కల్వి ఉరుతి తిట్టం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 అందిస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా ఇచ్చారు. మహిళల పట్ల జరిగిన నేరాలను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని విజయ్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రజారవాణా వాహనాల్లో 'స్మార్ట్ పానిక్ బటన్' ఏర్పాటు చేస్తామని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, మహిళల భద్రత కోసం పోలీసు వ్యవస్థలో "రాణి వేలు నచియార్" యూనిట్, నవజాత శిశువులకు బంగారు ఉంగరం, బేబీ కిట్ తదితర హామీలు ఇచ్చారు. మామల్లపురంలో టీవీకే ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఈ హామీలు ఇచ్చారు.