అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- అల్లు అరవింద్ ఇంట మోగిన పెళ్లి బాజా
- ప్రేయసి నయనిక మెడలో తాళి కట్టిన అల్లు శిరీష్
- నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
- కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ప్రైవేట్‌గా వివాహ వేడుక
- కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి
అల్లు శిరీష్, నయనిక జంటకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వధూవరులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి సీఎం ఫోటోలు దిగారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
గత నాలుగైదుళ్లుగా అల్లు శిరీష్, నయనిక ప్రేమించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, నేడు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. కాగా, మూడు రోజుల క్రితమే వీరి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరుకాగా.. నేడు జరిగిన పెళ్లిని మాత్రం అత్యంత ప్రైవేట్‌గా, సన్నిహితుల సమక్షంలో జరిపించడం విశేషం. ప్రస్తుతం అల్లు వారింట జరిగిన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.