- సదర్‌ను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
- వేడుకల నిర్వహణకు రూ.5 కోట్ల నిధులు కేటాయింపు
- హైదరాబాద్‌లోని గోల్కొండ ఒకనాటి గొల్లంకొండ అని రేవంత్ వ్యాఖ్య
సదర్ సమ్మేళనం కేవలం యాదవ సోదరుల పండుగే కాదని, అది తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదవుల చిరకాల కోరికను నెరవేరుస్తూ.. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వేడుకల నిర్వహణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
గతంలో ఏ ముఖ్యమంత్రీ సదర్‌ను రాష్ట్ర పండుగగా ప్రకటించే ఆలోచన చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని నేటి గోల్కొండ కోట ఒకనాటి 'గొల్లంకొండ' అని, నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమని కొనియాడారు. తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని, అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యే పదవి ఇచ్చామని గుర్తుచేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో విజయవంతంగా నిర్వహించిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాబోయే రోజుల్లో యాదవులకు న్యాయమైన వాటా దక్కేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టలో గోసంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు యాదవ సోదరులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.