ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు
- మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపిన యువకులు
- ముందు వెళుతున్న డీసీఎంను ఢీకొట్టి డివైడర్ ను తాకిన కారు
- కారు పూర్తిగా దగ్ధం.. ప్రమాదం నుంచి బయటపడ్డ యువకులు
ఫైరింజన్ వచ్చే లోపే..
ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగంలో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ కారులోని యువకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.