తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

నిన్న బుధవారం నాడు మొత్తం 68,004 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,964 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లుగా నమోదైంది.

అదేవిధంగా, నిన్న ఒక్కరోజే 3.31 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. సుమారు 1.51 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో 2,282 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించింది.