Ponguleti Srinivas Reddy: నా మాటలు ఎలా లీక్ అయ్యాయి..? బీఆర్ఎస్ ఇప్పటికీ ఫోన్ ట్యాప్ చేస్తోందేమో!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- బీఆర్ఎస్ నేతలపై మంత్రి అనుమానాలు
- సమీక్షలో మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయని వ్యాఖ్య
- ఉద్యోగులతో మాట్లాడిన మాటలు ఎవరు విన్నారో విచారణ చేయిస్తానని వెల్లడి
బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారేమోననే అనుమానం వస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సమీక్షలో మాట్లాడిన విషయాలు బయటకు లీక్ అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా ఎదులాపురం పురపాలక ఎన్నికలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన విషయాలు బయటకు లీక్ కావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో మాట్లాడిన మాటలు ఎలా విన్నారో పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తానని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.