Suryakumar Yadav: సూర్యకుమార్ సంచలనం.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!

Suryakumar Yadav Breaks Virat Kohli Record in T20s
  • విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్
  • టీ20ల్లో 17వ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న సూర్య‌
  • ప్రపంచ జాబితాలో మూడో స్థానానికి చేరిన భారత కెప్టెన్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు శుభారంభం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించడమే కాకుండా, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీని అధిగమించి చరిత్ర సృష్టించాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 84 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై మొదట నిలకడగా ఆడి, ఆ తర్వాత అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని బాధ్యతాయుతమైన ఆటతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 161/9 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

సూర్య అద్భుతం.. కోహ్లీ రికార్డు బద్దలు!
జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్‌కు గానూ సూర్యకుమార్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇది అతనికి అంతర్జాతీయ టీ20ల్లో 17వ అవార్డు. దీంతో 16 అవార్డులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును అతను బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (14) మూడో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక టీ20 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుల జాబితాలో సూర్య మూడో స్థానానికి చేరాడు. మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ (22), జింబాబ్వే ఆల్-రౌండర్ సికందర్ రజా (19) మాత్రమే అతని కంటే ముందున్నారు.
Suryakumar Yadav
Suryakumar
Virat Kohli
T20 World Cup 2026
Player of the Match
India vs USA
Cricket Record
Rohit Sharma
Wankhede Stadium
T20 Cricket

More Telugu News