కేబుల్ బ్రిడ్జిపై బైక్ దగ్ధం.. వీడియో ఇదిగో!

కేబుల్ బ్రిడ్జిపై బైక్ దగ్ధం.. వీడియో ఇదిగో!

Bike gutted in fire on Durgam Cheruvu Cable Bridge
––
మాదాపూర్ లోని దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి మీద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం ఓ ద్విచక్ర వాహనం బ్రిడ్జిపై దగ్ధమైంది. రన్నింగ్ లో ఉండగా బైక్ లో మంటలు ఎగసిపడ్డాయి. తోటి వాహనదారులు అప్రమత్తం చేయడంతో బైక్ పై వెళుతున్న యువకుడు వెంటనే వాహనాన్ని ఆపేశాడు. బ్రిడ్జిపైన ఓ పక్కకు స్టాండ్ వేసి నిలిపాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడి ఆ బైక్ మొత్తం కాలిబూడిదైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Durgam Cheruvu
Viral vedio
Cable Bridge
Hyderabad
Bike Accident
Fire Accident
Madhapur
Telangana
Bike Fire

More Telugu News