Nirmala Sitharaman: భారతీయుల తలపై అప్పుల భారం.. ప్రతి ఒక్కరిపై రూ.1.34 లక్షలు!

Nirmala Sitharaman Debt burden on Indians rises to Rs 134 lakh per person
  • భారీగా పెరిగిన తలసరి అప్పు
  • రూ. 17.2 లక్షల కోట్ల కొత్త రుణాలు
  • బడ్జెట్‌లో 17 శాతం అదనపు అప్పు
  • రూ. 214 లక్షల కోట్లకు మొత్తం భారం
దేశ పౌరులపై అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న భారీ రుణాల ప్రభావం సామాన్యుడిపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరిపై సగటున రూ. 1.34 లక్షల రుణ భారం ఉందని లెక్కలు చెబుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం.. ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా రూ. 17.2 లక్షల కోట్ల మేర మార్కెట్ నుంచి అప్పు సేకరించనుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

2027 మార్చి నాటికి దేశ మొత్తం అప్పు అక్షరాలా రూ. 2,14,82,050 కోట్లకు చేరుతుందని అంచనా. 2019లో జీడీపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం లోపు ఉండగా, ఇప్పుడు దాన్ని 55.6 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అప్పుల వాటా క్రమంగా పెరుగుతూనే ఉంది.

మరోవైపు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది. ఖర్చులకు, ఆదాయానికి మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకే కేంద్రం మళ్లీ అప్పుల బాట పడుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ఈ అప్పుల భారం భవిష్యత్తులో సామాన్యుడిపై పన్నుల రూపంలో లేదా సబ్సిడీల కోత రూపంలో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
Nirmala Sitharaman
Indian debt
India debt
Indian economy
National debt
Debt burden
Fiscal deficit
GDP
Indian citizen
Government borrowing

More Telugu News