అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్
- శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్
- ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్
- మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం
డిసెంబరు 17 నాటికి భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం... మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని వివరించింది. అయితే, దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని, అదే సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఎలాంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే, ఆ శాటిలైట్ కాలిపోతుందని తెలిపింది.
కాగా, కూలిపోతున్న స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది.