- ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
- భారీ బందోబస్తు మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్
- 77 జడ్పీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో ఇప్పటికే 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 2,169 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో వైసీపీ నుంచి 574 మంది, టీడీపీ నుంచి 452 మంది, జనసేన నుంచి 109 మంది, బీజేపీ నుంచి 34 మంది బరిలో ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు వెయ్యి మంది పోటీ చేశారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని 9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 7,767 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, 18,844 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీడీపీ నుంచి 6,342 మంది, వైసీపీ నుంచి 7,622 మంది, జనసేన నుంచి 1,499 మంది, బీజేపీ నుంచి 280 మంది ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు 3,101 మంది పోటీ చేశారు. ఈనాటి ఫలితాలతో వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.