సజ్జనార్ సంచలన నిర్ణయం... టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాకిచ్చిన సీపీ
- ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సీపీ
- కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ర్యాంకు అధికారుల అటాచ్
- కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో పాతుకుపోయిన అధికారులు
గత కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో అధికారులు బదిలీలు లేకుండా ఉన్నారు. ఇటీవలి కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఒక నిందితుడిని తప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.