17 ఏళ్ల బాలికతో పెళ్లి... రంగారెడ్డి జిల్లా పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు
- సరూర్ నగర్ పరిధిలో 2018లో బాలికకు బలవంతపు పెళ్లి
- కేసులో బాలిక భర్త, తండ్రికి జీవిత ఖైదు
- రూ.75 వేల చొప్పున జరిమానా విధించిన కోర్టు
ఈ కేసులో బాలిక భర్తకు, తండ్రికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.