తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
- తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే
- ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులు
- క్యాట్‌లో సవాల్ చేయడంతో అమ్రపాలికి అనుకూలంగా ఉత్తర్వులు
- క్యాట్ ఉత్తర్వులను హైకోర్టులో అప్పీల్ చేసిన డీవోపీటీ
క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై డీవోపీటీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.