Nirmala Sitharaman: రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలం కాదన్న ఆర్థిక మంత్రి
- ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనన్న నిర్మలా సీతారామన్
- డాలర్ తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ
- సమీప భవిష్యత్తులో రూ.91 మార్క్ తాకనుందని అంచనా
అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 89.95 గా ఉంది. రెండు రోజుల క్రితం ఈ విలువ 90 కి చేరింది. సమీప భవిష్యత్తులో ఈ మారకం విలువ రూ.91కి చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలం కాదని చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో మాట్లాడుతూ.. రూపాయి పతనం వల్ల భారత దేశంలోని ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని మంత్రి అభిప్రాయపడ్డారు.
భారత రూపాయి మారకం విలువ ఇటీవల అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ డిసెంబర్ 3న రూపాయి రూ. 90.43 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి, ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది మరియు విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ ప్రయాణికుల బడ్జెట్‌లపై ప్రభావం చూపుతుంది. అయితే, బలహీనమైన రూపాయి భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో చౌకగా మారతాయి.