బాలకృష్ణ 'అఖండ 2' విడుదలపై 'బుక్ మై షో' అప్ డేట్
- వాయిదా పడిన 'అఖండ 2' విడుదలపై కొత్త ప్రచారం
- వచ్చే ఏడాది రిలీజ్ అంటూ బుక్ మై షో యాప్‌లో అప్‌డేట్
- సంక్రాంతికి సినిమా వస్తుందని అభిమానుల అంచనాలు
డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా కోర్టు వ్యవహారంతో చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. త్వరలోనే ఒక 'బ్లాక్‌బస్టర్ తేదీ'తో వస్తామని చిత్ర నిర్మాత ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో 'వచ్చే ఏడాది' అని పేర్కొనడంతో, అభిమానులు సంక్రాంతి విడుదలను అంచనా వేస్తున్నారు. గతంలో బాలకృష్ణ అనేకసార్లు సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేసి ఘన విజయాలు అందుకున్నారు. ఈ సెంటిమెంట్‌ను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బుక్ మై షో కేవలం అంచనాతోనే ఈ తేదీని అప్‌డేట్ చేసిందా? లేక చిత్ర బృందం నుంచి ఏదైనా సమాచారం అందిందా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.