JP Nadda: నడ్డాకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- నేడు జేపీ నడ్డా జన్మదినం
- ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు
- నడ్డా నాయకత్వాన్ని కొనియాడిన పవన్ కల్యాణ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా తమ అభినందనలు తెలియజేశారు.
జేపీ నడ్డా ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం జేపీ నడ్డాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. "మీ నాయకత్వంలో బీజేపీ అనేక ఎన్నికల్లో విజయాలు సాధించింది. దేశవ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతమైంది. మీ నాయకత్వ పటిమ, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.