గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా వైజాగ్.. భారీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన
- విశాఖలో ఏఐ డేటా సెంటర్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన
- ప్రముఖ సంస్థ సిఫీ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం
- రెండు దశల్లో రూ.1500 కోట్ల భారీ పెట్టుబడి
- సుమారు వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
- నగరంలో తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు
నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ సిఫీ టెక్నాలజీస్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. దాని అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. కేవలం డేటా సెంటరే కాకుండా, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.
ఈ ప్రాజెక్టు కోసం సిఫీ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా ఒక కీలకమైన డిజిటల్ గేట్‌వేగా మారనుందని, ఇది రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.