ఇంటి ఆవకాయ నుంచి గ్లోబల్ బ్రాండ్‌గా.. వైరల్ పోస్ట్‌తో మళ్లీ వెలుగులోకి ప్రియా పచ్చళ్ల అద్భుత ప్రస్థానం!
- వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి ప్రియా ఫుడ్స్ కథ
- సాధారణ అవసరాన్ని గుర్తించి 1980లో ప్రియా ఫుడ్స్‌ను ప్రారంభించిన రామోజీరావు
- 6 రకాల పచ్చళ్లతో మొదలై.. 30కి పైగా దేశాల్లో 200 పైచిలుకు ఉత్పత్తులు
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇంటి రుచులను అందించిన బ్రాండ్
- ఆహారం, జ్ఞాపకం, మన మూలాల మధ్య ఉన్న బంధానికి నిదర్శనంగా నిలిచిన ప్రియా
ఒకప్పుడు సూట్‌కేసులలో భద్రంగా దాచుకుని, విదేశాలకు తీసుకెళ్లే ఇంటి పచ్చళ్ల స్థానంలో, ఇప్పుడు ప్రతీచోట లభించే నమ్మకమైన బ్రాండ్‌గా ప్రియా ఫుడ్స్ నిలిచింది. తెలుగు సంప్రదాయ రుచులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు పరిచయం చేసిన ఈ సంస్థ ప్రస్థానం వెనుక ఉన్న కథ మరోసారి ఒక సోషల్ మీడియా పోస్ట్‌తో వైరల్ అయింది. ఆహారానికి, జ్ఞాపకాలకు మధ్య ఉండే విడదీయరాని బంధాన్ని ఈ కథ కళ్లకు కడుతోంది.
ఇటీవల 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ యూజర్ పెట్టిన పోస్ట్ ఎంతోమందిని కదిలించింది. ఆ పోస్ట్‌లో రెండు విభిన్నమైన సంఘటనలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం, అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి.. అమ్మమ్మ ప్రేమగా పెట్టిన గోంగూర పచ్చడి జాడీ సూట్‌కేసులో పగిలిపోవడంతో కస్టమ్స్ అధికారులు దాన్ని పారేశారు. అక్కడి చప్పటి తిండి తినలేక ఆ విద్యార్థి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కట్ చేస్తే, వర్తమానంలో కాలిఫోర్నియాలోని ఓ భారతీయ స్టోర్‌లో ఒక తాతయ్య, తన మనవరాలికి ఎర్ర మూత ఉన్న ప్రియా పచ్చడి జాడీని చూపిస్తూ, 'ఇదే మన ఇల్లు' అని చెప్పడం ఎంతోమంది హృదయాలను హత్తుకుంది. ఇంటి రుచికి దూరమైన వారి వేదనను గుర్తించి, దాన్ని ఒక వ్యాపార అవకాశంగా మలిచిన తీరుకు ఈ పోస్ట్ అద్దం పడుతోంది.
ఈ అద్భుత విజయగాథ వెనుక ఉన్న సూత్రధారి మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక వంటి సంస్థలతో అప్పటికే తనదైన ముద్ర వేశారు. సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని భారీ వ్యాపారాలుగా మార్చడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ కోవలోనే 1980లో ప్రియా ఫుడ్స్‌ను స్థాపించారు. తరతరాల తెలుగు ఇంటి వంటకాలకు ఆధునిక ఫుడ్ టెక్నాలజీని జోడించి, రుచి చెక్కుచెదరకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే పచ్చళ్లను తయారు చేయడమే దీని లక్ష్యం.
కేవలం ఆరు రకాల పచ్చళ్లతో ప్రారంభమైన ప్రియా ప్రయాణం, నేడు 200లకు పైగా ఉత్పత్తులకు విస్తరించింది. పచ్చళ్లతో పాటు వంట పేస్టులు, మసాలా పొడులు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు, రెడీ-టు-ఈట్ వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల వంటగదిలో ముఖ్యమైన భాగంగా మారింది. అమెరికా, బ్రిటన్, యూరప్, పశ్చిమాసియా.. ఇలా భారతీయులు ఎక్కడికి వెళ్లినా, పగిలిపోయే గాజు సీసాల భయం లేకుండా, వారికి ప్రియా రూపంలో ఇంటి భోజనం దొరికింది.
రామోజీ ఫిల్మ్ సిటీ, ఈటీవీ నెట్‌వర్క్, ఉషాకిరణ్ మూవీస్ వంటి ఎన్నో గొప్ప సంస్థలను నిర్మించిన రామోజీరావు, 2024 జూన్‌లో తుదిశ్వాస విడిచారు. అయినా ఆయన ప్రారంభించిన ప్రియా ఫుడ్స్, "మనుషులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, వారి నాలుక మాత్రం సొంత రుచులనే కోరుకుంటుంది" అనే ఆయన తత్వాన్ని ముందుకు తీసుకెళుతోంది. ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో, నాణ్యమైన ముడిసరుకులతో ఉత్పత్తులను తయారు చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. ప్రియా పచ్చడి కేవలం ఒక వ్యాపార విజయం మాత్రమే కాదు, అది తరాలను, ఖండాలను కలిపే ఒక సాంస్కృతిక వారధి.