Advertisement

రాముడిని, మోదీని తిడతారా?.. భారత్ లో నిరసనలపై డానిశ్ కనేరియా ఫైర్!

Danish Kaneria slams protests in India for abusing Lord Rama and PM Modi
  • భారత్‌లో నిరసనల తీరుపై పాక్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా ఆగ్రహం
  • ప్రతి నిరసనలో రాముడిని, మోదీని దూషించడం కామన్ అయిపోయిందన్న కనేరియా
  • చర్చలు, పరిష్కారాలు లేకుండా నినాదాలు, గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శ
  • వాస్తవాలు తెలుసుకోకుండానే నిరసనలు చేయడం సర్కస్‌లా మారిందంటూ ట్వీట్
భారత్‌లో జరుగుతున్న నిరసనల తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా మండిప‌డ్డాడు. దేశంలో జరిగే ప్రతి ఆందోళనలో ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరుగుతున్న కొన్ని నిరసనలను ఉద్దేశిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కనేరియా ఒక సుదీర్ఘ పోస్టు పెట్టాడు.  

"భారత్‌లో జరిగే ప్రతి నిరసనలో శ్రీరాముడిని, భారతమాతను, ప్రధాని మోదీని, ఆయన దివంగత తల్లిని దూషించడం కనిపిస్తుంది. అలాగే బ్రాహ్మణులను, హిందుత్వాన్ని కూడా నిందిస్తున్నారు. అక్కడ ఎలాంటి చర్చలు గానీ, పరిష్కారాలు గానీ ఉండవు. కేవలం నినాదాలు, దూషణలు, గందరగోళం మాత్రమే ఉంటాయి" అని కనేరియా తన పోస్టులో ఆరోపించాడు.

విపక్షాలు భారత్‌లో నేపాల్ లాంటి పరిస్థితిని సృష్టించాలనే భ్రమలో జీవిస్తున్నాయని అత‌డు విమర్శించాడు. "అమెరికాతో ఇంకా ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఖరారు కాకముందే, కొందరు రైతులు ఢిల్లీని దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఒక సర్కస్‌లా మారుతోంది. వాస్తవాలు తెలుసుకోకుండానే నిరసనలకు దిగితే దేశం ఎలా పురోగమిస్తుంది?" అని కనేరియా ప్రశ్నించాడు. దీంతో అత‌డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Danish Kaneria
Narendra Modi
India Protests
Farmers Protest Delhi
Hindutva
Lord Rama

More Telugu News