అంతరిక్షంలో 3 భారతీయ వంటకాలకే చోటు.. అసలు విషయం చెప్పిన శుభాంశు శుక్లా
- మూడు భారతీయ వంటకాలకే అనుమతి
- గాజర్ హల్వా, మూంగ్ హల్వా, ఆమ్‌రస్ ఎంపిక
- పరీక్షల్లో నిలవని మిగతా వంటకాలు
- సమయం లేక పూర్తి కాని పరీక్షలు
- వంటకాలు సహచరులతో పంచుకున్న శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్)కి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. తనతో మూడు భారతీయ వంటకాలు మాత్రమే తీసుకెళ్లినట్లు ఇటీవల వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్ కోసం అంతరిక్ష ఆహారాన్ని అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్) అనేక భారతీయ వంటకాలను సిద్ధం చేసినప్పటికీ, కఠిన పరీక్షల తర్వాత గాజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా, ఆమ్‌రస్‌కు (మామిడి పండ్ల గుజ్జు) మాత్రమే అంతరిక్ష ప్రయాణానికి అనుమతి లభించిందని చెప్పారు.
రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో ఇటీవల మాట్లాడిన శుక్లా.. మొదట ఖిచ్‌డీ, పులావ్, పలు కూరలు సహా మరిన్ని భారతీయ వంటకాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు. అయితే అక్కడ ఉండే ఆహారం భద్రత, పోషక విలువలు, సూక్ష్మజీవుల నియంత్రణ, ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యం వంటి అనేక పరీక్షలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. సమయం సరిపోకపోవడంతో మిగతా వంటకాలకు అవసరమైన అన్ని పరీక్షలు పూర్తికాలేదని వెల్లడించారు.
తనతో తీసుకెళ్లిన మూడు భారతీయ వంటకాలను తాను తినలేదని, వాటిని సహచర వ్యోమగాములతో పంచుకున్నానని శుక్లా తెలిపారు. వారు ఆ వంటకాలను ఎంతో ఆస్వాదించారని చెప్పారు. ‘‘అంతరిక్షంలో మన ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం కంటే ఆనందం మరొకటి ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
అయితే మిషన్‌లో 13 రోజులు గడిచిన తర్వాత కారం, ఉప్పు ఎక్కువగా ఉండే భారతీయ ఆహారం కోసం ఎంతో ఎదురుచూశానని శుక్లా చెప్పారు. అంతరిక్షంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల రుచి, వాసన గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుందని, నాసా అందించే ఆహారంలో కూడా సోడియం తక్కువగా ఉంటుందని వివరించారు. దీంతో ఉప్పు, కారం ఉన్న ఆహారం తినాలనే కోరిక ఎక్కువైందన్నారు.
భూమికి తిరిగి వచ్చిన తర్వాత తన భారతీయ ఫ్లైట్ సర్జన్ అరటిచిప్స్, భాకర్‌వాడీ తీసుకురావడంతో ఎంతో సంతోషించానని శుక్లా చెప్పారు. ఈ అనుభవం గగన్‌యాన్ మిషన్ కోసం మరిన్ని భారతీయ అంతరిక్ష ఆహారాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.