రష్యాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. కమ్చట్కా తీరంలో మరోసారి భూ ప్రకంపనలు
- ఇటీవల ఇక్కడే 8.8 తీవ్రతతో భారీ భూకంపం
- తాజాగా 5 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు
- సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం తప్పిన ముప్పు
కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత తాజా భూకంపం సంభవించడం గమనార్హం. ఆ భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ హెచ్చరికలకు కారణమైంది. తాజా భూకంపం సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ నిరంతరం కదులుతూ ఉండటం వల్ల కమ్చాట్కా ద్వీపకల్పం తరచుగా భూకంపాలకు గురవుతోంది. దీని కారణంగా, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.