వారణాసిలో చంద్రబాబు ప్రసంగానికి జేజేలు.. "వెరీ వెల్" అంటూ రాజ్‌నాథ్ ప్రశంస
- దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చిన చంద్రబాబు
- VKS మంత్రంతో భారత్ అభివృద్ధి ప్రస్థానం అన్‌స్టాపబుల్ అని వ్యాఖ్య
- అయోధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
- చంద్రబాబు ప్రసంగానికి వారణాసిలో విశేష స్పందన, చప్పట్లతో మార్మోగిన సభా ప్రాంగణం
- ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
"ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నాయకుడు (రైట్ టైమ్.. రైట్ లీడర్). ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, కేవలం దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీకి మనమందరం అండగా నిలవాలి. ఎన్డీయే ఐక్యతే ఈ దేశానికి బలం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని వారణాసిలో మంగళవారం నిర్వహించిన 'వారణాసి-వాద్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమం నుంచి సాంకేతికత వరకు చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను సమగ్రంగా వివరించారు.
VKS మంత్రంతో అభివృద్ధి
కాశీ క్షేత్రం ప్రధాని మోదీకి కర్మభూమి అని, ఇక్కడి ప్రజలు కేవలం తమ ఎంపీని మాత్రమే కాక, దేశానికి ఓ గొప్ప నాయకుడిని అందించారని చంద్రబాబు అన్నారు. "VKS (వాద్‌నగర్, కాశీ, సెప్టెంబర్) అనేది నేటి భారత అభివృద్ధి మంత్రం. ప్రధాని మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయి. జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి పథకాలతో 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కలిగింది. పీఎం కిసాన్ పథకం ద్వారా 11 కోట్ల మంది రైతులకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు అందుతోంది," అని వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయించి, 140 కోట్ల మంది ప్రజలను కాపాడటమే కాకుండా, 101 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించి మోదీ మానవత్వాన్ని చాటారని కొనియాడారు.
టెక్నాలజీ నుంచి జాతీయ భద్రత వరకు
ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి విధానాలతో ఒకప్పుడు రక్షణ పరికరాలు దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరిందని చంద్రబాబు తెలిపారు. "టెక్నాలజీని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీ. స్పేస్, డ్రోన్, క్వాంటం, సెమీ కండక్టర్ టెక్నాలజీలతో యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు. ఆయన దూరదృష్టితో దేశంలో 2.20 లక్షల స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు," అని అన్నారు. మహిళా సాధికారతకు 'భేటీ బచావో-భేటీ పడావో', 'లఖ్‌పతీ దీదీ' వంటి పథకాలతో పాటు, చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి అధినియమ్' ఒక గేమ్ ఛేంజర్ కాబోతోందని అభిప్రాయపడ్డారు.
దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ, "ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అంతమొందించారు. దానికి నేనూ ఒక బాధితుడినే. నక్సలైట్లు నన్ను టార్గెట్ చేశారు. కానీ మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉంది" అని చంద్రబాబు గుర్తుచేశారు.
భవిష్యత్ ప్రణాళికలు, అయోధ్యలో శ్రీవారి ఆలయం
దేశంలో నదుల అనుసంధానం కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. "బ్రహ్మపుత్ర, గంగ, మహానది, గోదావరి, కావేరి నదులను అనుసంధానిస్తే భారత్ అభివృద్ధి అన్‌స్టాపబుల్ అవుతుంది," అని ఆయన అన్నారు. శతాబ్దాల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోదీ నిజం చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా, "త్రేతాయుగ దైవమైన శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకు 10 ఎకరాల భూమి కేటాయించాలి" అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వేదికపైనే కోరారు.
ప్రసంగానికి విశేష స్పందన
'ఆజ్ మే కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ' అంటూ హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు, సభికులను తన ప్రసంగంలో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగారు. 'దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు, హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు ప్రసంగం ముగిశాక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా స్పందిస్తూ, "చంద్రబాబు చాలా అద్భుతంగా మాట్లాడారు.. వెరీ వెల్.. వెరీ వెల్" అని ప్రశంసించి, ఆయనకు అభినందనగా చప్పట్లు కొట్టాలని సభికులను కోరారు. దీంతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. కార్యక్రమానికి ముందు చంద్రబాబు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 'సేవా సంకల్ప్ యాత్ర'ను జెండా ఊపి ప్రారంభించారు.