Turkish Airlines: విమానం గాల్లో ఉండ‌గా ప్ర‌యాణికుడి మృతి.. మృత‌దేహం అదృశ్యం..!

Turkish Airlines Passenger Dies Mid Flight The Body Has Mysteriously Disappeared
  • శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ లో ఘ‌ట‌న
  • ఈ నెల 13న ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బ‌య‌ల్దేరిన టీకే79 విమానం 
  • విమానం గాల్లో ఉండ‌గానే అస్వ‌స్థ‌త‌కు గురై చ‌నిపోయిన‌ ఓ ప్ర‌యాణికుడు 
  • ఫ్లైట్‌ను షికాగో విమానాశ్ర‌యానికి మ‌ళ్లించి ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ 
  • కుక్ కౌంటీ మెడిక‌ల్ ఎగ్జామిన‌ర్ కార్యాల‌యానికి మృతదేహం అప్ప‌గింత‌
  • ఎయిర్‌లైన్స్ నుంచి త‌మ‌కు ఎలాంటి మృత‌దేహం అంద‌లేద‌న్న‌ ఎగ్జామిన‌ర్ కార్యాల‌యం
విమానం గాల్లో ఉండ‌గా ఓ ప్ర‌యాణికుడి అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే, ఆ త‌ర్వాత అత‌డి మృత‌దేహం అదృశ్యమైంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఈ నెల 13న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ కు చెందిన టీకే79 విమానం ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బ‌య‌ల్దేరింది. అయితే, విమానం గాల్లో ఉండ‌గానే ఓ ప్ర‌యాణికుడు అస్వ‌స్థ‌త‌కు గురై చ‌నిపోయాడు. దాంతో ఫ్లైట్‌ను ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్ ఎయిర్‌పోర్టుకు మ‌ళ్లించాల‌ని భావించారు. కానీ, అది కుద‌రక‌పోవ‌డంతో షికాగో విమానాశ్ర‌యానికి మ‌ళ్లించి ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడిక‌ల్ ఎగ్జామిన‌ర్ కార్యాల‌యానికి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. అలాగే మిగిలిన ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌త్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు. అయితే, తుర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి త‌మ‌కు ఎలాంటి మృత‌దేహం అంద‌లేద‌ని ఎగ్జామిన‌ర్ కార్యాల‌య ప్ర‌తినిధి న‌టాలియా డెరెవ్యానీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో విమానం ల్యాండింగ్ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.  


Turkish Airlines
Turkish Airlines passenger death
San Francisco flight
Istanbul to San Francisco
missing body
Cook County Medical Examiner
flight emergency landing
Chicago airport

More Telugu News