రష్యాలోని ఆ ప్రాంతంలో 10 లక్షల మంది భారతీయులకు ఉపాధి
- కార్మిక శక్తి కొరతను అధిగమించేందుకు భారత్ వైపు రష్యా దృష్టి
- ఉరల్ పర్వత సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతంలో కార్మికుల కొరత
- యాకటెరిన్ బర్గ్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ ప్రారంభించనున్న రష్యా
రష్యాలోని ఉరల్ పర్వతాలు సమీపంలో యాకటెరిన్‌బర్గ్ ప్రాంతం ఉంది. ఇది భారీ పరిశ్రమలకు కేంద్రం. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందని అండ్రీ బెసెడిన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు శ్రీలంక, ఉత్తర కొరియా నుంచి కార్మికులను రప్పించాలని రష్యా భావిస్తోంది. రష్యాలో కార్మికుల కొరత ఉన్నందున భారత్‌తో సహా ఇతర దేశాల వైపు చూస్తోంది.