మనం సృష్టించిన మేధస్సు.. మనల్నే మింగేస్తే? ఏఐపై ఎందుకీ దిగ్గజాల హెచ్చరికలు?
- ఏఐ మానవాళికి ముప్పుగా మారొచ్చంటూ నిపుణుల హెచ్చరిక
- పదేళ్లలో సూపర్ ఏఐ ప్రమాదాన్ని ప్రస్తావించిన జాకబ్ కాక్సన్
- ఏఐ సంస్థలు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆరోపణ
- ఏఐ నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మస్క్
- మనుషులను ఏఐ మించిపోవచ్చన్న జెఫ్రీ హింటన్
ఒకప్పుడు మనిషి యంత్రాలకు ఆలోచించడం నేర్పించాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఆ యంత్రాలే మనిషిని మించి ఆలోచిస్తే? అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషి ఆపలేని స్థాయికి కృత్రిమ మేధస్సు చేరితే ఏం జరుగుతుంది? ఇది ఇక సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కనిపించే ప్రశ్న కాదు. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ నిపుణులు, టెక్ దిగ్గజాలు ఇదే విషయంపై తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
జీవితాలతో జూదమాడుతున్నారా?
తాజాగా జాకబ్ కాక్సన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరోసారి ముందుకు తెచ్చాయి. ఆంథ్రోపిక్ నుంచి తప్పుకొన్న ఆయన గతంలో ఓపెన్‌ఏఐలోనూ పనిచేశారు. ఏఐ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న ఆందోళనతో బయటకు వచ్చినట్లు చెప్పారు. ‘‘మన జీవితాలతో జూదమాడుతున్నారు’’ అంటూ ఏఐ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ.. మనుషులందరినీ చంపగల ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అది వచ్చే పదేళ్లలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు.
మస్క్ భయం కూడా ఇదే
ఇది కాక్సన్ ఒక్కడి అభిప్రాయం కాదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలాకాలంగా ఇదే ప్రమాదాన్ని ప్రస్తావిస్తున్నారు. మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైన ఏఐను నియంత్రించడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ గ్రిడ్లను హ్యాక్ చేయడం, నీటి సరఫరాలను నిలిపివేయడం, ప్రమాదకర జీవ ఆయుధాల రూపకల్పనకు ఏఐను ఉపయోగించడం వంటి ముప్పుల్ని ఆయన ప్రస్తావించారు.
అయితే ఈ హెచ్చరికలు సాధారణ ఏఐ గురించి కాదు. మనిషి చేసే దాదాపు అన్ని మేధో పనులను చేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) గురించి. ఈ విషయం మస్క్‌కు ప్రత్యేకంగా కీలకం. ఎందుకంటే ఆయన ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆటోమేటిక్ కార్ల సాంకేతికతలోనూ ముందున్నారు.
మనల్ని మించిపోతే?
ఏఐ రంగంలో ‘గాడ్‌ఫాదర్’గా పేరున్న జెఫ్రీ హింటన్ కూడా గూగుల్ నుంచి తప్పుకొన్న తర్వాత ఇదే ప్రమాదాలపై బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఏజీఐ మనుషులను మేధస్సులో అధిగమించవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మనుషులను ప్రభావితం చేయడం, అధికారాన్ని సంపాదించాలనే ప్రమాదకర లక్ష్యాలను స్వయంగా ఏర్పరచుకోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చని చెబుతున్నారు.
ట్యూరింగ్ అవార్డు గ్రహీత యోషువా బెంగియో సైతం అత్యాధునిక ఏఐ అభివృద్ధిపై కఠిన నిబంధనలు కోరుతున్నారు. భద్రతకు సంబంధించిన ప్రమాణాలు నిరూపితమయ్యే వరకు శక్తిమంతమైన ఏఐ మోడళ్ల శిక్షణను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
భయం ఒక్కటే కాదు.. బాధ్యత కూడా
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్, ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ పాకోచ్కీ, సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కూడా ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని అంగీకరించారు. ఇది ప్రపంచ స్థాయి ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు.
ఏఐ మనిషి సృష్టించిన అద్భుతమైన సాంకేతికత. కానీ అదే సాంకేతికత మనిషిని మించి వెళ్లిన రోజు ఏం జరుగుతుందన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. బహుశా అసలు పోటీ ఏఐతో కాదు.. మనిషి తన సృష్టిని ఎంతవరకు నియంత్రించగలడన్నదే.