రాహుల్‌కు ఇటాలియన్‌లో లేఖ.. ఫీజు బకాయిలపై బీజేపీ చీఫ్ వినూత్న నిరసన
- రాహుల్ గాంధీకి ఇటాలియన్ భాషలో లేఖ రాసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై వినూత్నంగా నిరసన
- రూ.15 వేల కోట్ల బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ
- విద్యార్థులకు మద్దతిస్తే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని విమర్శ
- కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ హామీలను నెరవేర్చలేదని విమర్శలు
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించేందుకు బీజేపీ సీనియర్ నాయకులు ఎన్. రామచందర్ రావు వినూత్న నిరసన చేపట్టారు. బుధవారం ఆయన రాహుల్ గాంధీకి ఇటాలియన్ భాషలో లేఖ రాశారు. రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, పోలీసుల లాఠీఛార్జులు, అరెస్టులు వంటివేవీ రాహుల్ గాంధీని గానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ కదిలించలేకపోయాయని, అందుకే ఆయన "మాతృభాష" అయిన ఇటాలియన్‌లో లేఖ రాస్తున్నట్లు రామచందర్ రావు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫలితంగా విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, సిబ్బంది కూడా అరకొర వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు, పోలీసు చర్యలతో అణచివేస్తోందని రామచందర్ రావు విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం గళమెత్తినందుకు గత 10 రోజుల్లోనే తనను నాలుగుసార్లు అరెస్టు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'యూత్ డిక్లరేషన్'లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, విద్యా భరోసా కార్డుల వంటి హామీలను నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి బకాయిలన్నీ విడుదల చేయించాలని, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.