ఇండియన్ నేవీలో నియామకాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
--
రూ.550 అప్లికేషన్ ఫీజు చెల్లించి నేవీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో అధికారులు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత అభ్యర్థులు నాలుగేళ్ల పాటు నేవీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.