శివరాత్రి పండుగ నేపథ్యంలో అధికారులతో కొండా సురేఖ సమీక్ష
- సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశం
- వేములవాడతో పాటు అన్ని దేవస్థానాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్న మంత్రి
వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, మేళ్ల చెరువు, పానగళ్లు, పాలకుర్తి, వెయ్యిస్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశీబుగ్గ శివాలయం, భద్రకాళి గుడి తదితర దేవస్థానాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆయా దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అన్నారు.