ఏపీలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Six IPS officers transferred in Andhra Pradesh
  • ఆరుగురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
  • అడ్మిన్ ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా బదిలీ
  • నంద్యాల జిల్లా ఏఎస్పీగా సుస్మిత బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు యువ ఐపీఎస్ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


బదిలీ అయిన అధికారులు, వారికి కేటాయించిన కొత్త బాధ్యతల వివరాలు:

అధికారి పేరుపాత పోస్టింగ్కొత్త పోస్టింగ్ - బదిలీ అయిన స్థానం
నవజ్యోతి మిశ్రాచింతపల్లి ఏఎస్పీఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లా
పాటిల్ దేవరాజ్ మనీశ్కాకినాడ ఏఎస్పీఅదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం)
మందా జావళి అల్ఫోన్స్ నంద్యాల ఏఎస్పీఓఎస్డీ (అడ్మిన్), పోలవరం జిల్లా
మనోజ్ రామనాథ్ హెగ్డేరాజంపేట్‌ ఏఎస్పీఓఎస్డీ (లా అండ్ ఆర్డర్), అమరావతి
రోహిత్ కుమార్ చౌదరితాడిపత్రి ఏఎస్పీఅదనపు ఎస్పీ (అడ్మిన్), పల్నాడు జిల్లా
సుస్మితజంగారెడ్డిగూడెం ఏఎస్పీఏఎస్పీ, నంద్యాల
Andhra Pradesh Government
AP IPS Transfers
IPS Officer Postings
Navjyoti Mishra IPS
AP Police Department
Andhra Pradesh Govt

More Telugu News