వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
- ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి
- మూడు రోజుల క్రితం షర్మిల ఇంటికి వెళ్లి ఆమెతో మూడు గంటలపాటు సమావేశం
- రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ
విజయసాయి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలోనూ పలుమార్లు ఆయనపై విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇకనైనా నిజాలు బయటపెట్టాలని సూచించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి పార్టీని వీడారని విమర్శించారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.