పేపర్ లీక్ ముఠాలను ఇక సహించేది లేదు.. ఇన్‌స్టాలో మోదీ కొత్త సందేశం
- పేపర్ లీకులను అరికట్టే సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
- స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోదీ
- పేపర్ లీక్ మాఫియాపై ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
- పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడి
- విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ
పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకులను అరికట్టే సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసిన ఆయన.. పేపర్ లీక్ మాఫియాపై ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలన్నీ పేపర్ లీకుల సమస్యను ఎదుర్కొన్నాయని మోదీ గుర్తుచేశారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం, వేగవంతమైన వ్యవస్థలను అమలు చేయడం, పారదర్శకతను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త చట్టంతో పేపర్ లీక్ ముఠాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.