ఏఆర్ రెహమాన్ బంగారం... ఆయననేమీ అనొద్దు: భార్య సైరా భాను

ఏఆర్ రెహమాన్ బంగారం... ఆయననేమీ అనొద్దు: భార్య సైరా భాను

Wife Saira Banu supports AR Rahman and called him gem of a person
  • బీటలు వారిన రెహమాన్ వైవాహిక జీవితం
  • ఇటీవల విడాకుల ప్రకటన చేసిన రెహమాన్ భార్య సైరా భాను
  • రెహమాన్ కారణంగానే అంటూ కథనాలు
  • మోహిని డే అనే అమ్మాయితో రెహమాన్ కు అపైర్ అంటూ ప్రచారం
  • ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ ఖండించిన సైరా భాను
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా భాను దంపతులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, రెహమాన్ సంగీత బృందంలో బాసిస్ట్ గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి కారణంగానే ఈ విడాకులు అంటూ ప్రచారం జరుగుతోంది. రెహమాన్ విడాకులు తెరపైకి వచ్చిన రోజే... మోహిని డే భర్త నుంచి విడిపోతున్నట్టుగా పోస్టు పెట్టడం ఈ ఊహాగానాలకు నాంది పలికింది. 

ఈ నేపథ్యంలో, రెహమాన్ భార్య సైరా భాను స్పందించారు. రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆ మేరకు సైరా భాను న్యాయవాది వందనా షా ఓ వాయిస్ క్లిప్ ను విడుదల చేశారు. 

"నేను సైరా భానును మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నాను. గత కొన్నినెలలుగా శారీరకంగా నా పరిస్థితేమీ బాగాలేదు. అందుకే రెహమాన్ నుంచి విడాకులు కోరుకుంటున్నాను. ఇదే మా విడాకులకు కారణం. యూట్యూబ్ కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... దయచేసి రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. నా అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. 

నేను ఎక్కడున్నానో నాకు తెలుసు... కానీ మీరే (మీడియా) సైరా ఎక్కడుందంటూ వెతుకుతున్నారు. నేను చికిత్స తీసుకునేందుకు ముంబయి వచ్చాను. నా పిల్లలను కానీ, రెహమాన్ ను కానీ ఎవరినీ నేను డిస్ట్రబ్ చేయదలుచుకోలేదు. కానీ రెహమాన్ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడ్ని అలా వదిలేయండి. నేను అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు కూడా నన్ను అలాగే ప్రేమించాడు. దయచేసి అతడిపై తప్పుడు ఆరోపణలు చేయకండి. అతడ్ని బజారుకీడ్చవద్దు. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని చెన్నై వస్తాను" అంటూ సైరా బాను తన వాయిస్ నోట్ లో వివరించారు.
Advertisement
AR Rahman
Saira Banu
Divorce
Chennai

More Telugu News