సంజూ శాంసన్ విషయంలో ఆ రాత్రి నిద్రపోలేదు: గౌతమ్ గంభీర్
- సంజూను తప్పించడంపై మనసు విప్పిన హెడ్ కోచ్ గంభీర్
- ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి నిద్రపట్టలేదని వెల్లడి
- సోషల్ మీడియా చూసి తుది జట్టును నిర్ణయించబోమని వ్యాఖ్య
- కొన్ని ఓటములకే అనుభవజ్ఞులను పక్కనపెట్టలేమని స్పష్టీకరణ
- కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిస్వార్థం గొప్ప లక్షణమంటూ ప్రశంస
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం తన రెండేళ్ల కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని, ఆ రాత్రి తాను నిద్ర కూడా పోలేకపోయానని తెలిపాడు. వెస్టిండీస్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు జియోస్టార్‌తో మాట్లాడుతూ గౌతీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్‌ను, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ అనంతరం జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే, ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచ్చిన సంజూ, వరుసగా అర్ధ శతకాలతో సత్తా చాటాడు.
ఈ నిర్ణయంపై గంభీర్ మాట్లాడుతూ.. "నా రెండేళ్ల కోచింగ్ ప్రయాణంలో ఆ ఒక్క రాత్రే నేను నిద్రపోలేకపోయాను. ఈ విషయాన్ని నేను సంజూతోనే చెప్పాను. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో నా కోచింగ్ కెరీర్‌లో అది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రపంచకప్ హీరో అయిన ఆటగాడిని కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల తర్వాత పక్కనపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్ గెలవాలంటే మాకు టాపార్డర్‌లో పరుగులు అవసరమయ్యాయి. సంజూతో నేను చాలా నిజాయతీగా మాట్లాడాను. అతను కూడా దాన్ని సానుకూలంగా స్వీకరించాడు" అని వివరించాడు.
అదే సమయంలో వైభవ్ వంటి యువ ఆటగాళ్లు తమ అవకాశం కోసం వేచి ఉండాలని గంభీర్ స్పష్టం చేశాడు. "సోషల్ మీడియా లేదా బయటి గోల తుది జట్టును నిర్ణయించదు. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, కోచ్ కలిసి.. ఎవరైతే మ్యాచ్ గెలిపిస్తారని భావిస్తామో వారికే అవకాశం ఇస్తాం. రెండు సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను కొన్ని వైఫల్యాలకే పక్కనపెట్టి, డ్రెస్సింగ్ రూమ్‌లో అభద్రతాభావాన్ని సృష్టించలేం. ప్రజాదరణ పొందే నిర్ణయాలు తీసుకోవడం సులభం, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడమే కష్టం. మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం" అని గంభీర్ పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. "కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్‌లో నాకు నచ్చిన ప్రధాన లక్షణం అతని నిస్వార్థం. జట్టు ప్రయోజనాల కోసం తన నాలుగో బ్యాటింగ్ స్థానాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడేవాడు. ఒక కెప్టెన్ ఇలా చేయడం చాలా అరుదు. ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం నిస్వార్థం. అది శ్రేయస్‌లో పుష్కలంగా ఉంది" అని కొనియాడాడు. ఒకటి రెండు ఓటములతో జట్టును అంచనా వేయలేమని, జట్టులో కొనసాగింపు చాలా ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు.