బెంగాల్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి.. సీఈసీపై విమర్శల నేపథ్యంలో మమత డిమాండ్‌

బెంగాల్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి.. సీఈసీపై విమర్శల నేపథ్యంలో మమత డిమాండ్‌

Mamata Banerjee demands fresh assembly elections in West Bengal amid CEC row
  • పాత ఓటర్ల జాబితాతో బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు జరపాలని మమత డిమాండ్‌
  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను అరెస్టు చేయాలని మమత వ్యాఖ్య
  • దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని మమత ప్రకటన
  • 30 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని అభిషేక్‌ ఆరోపణ
  • ఇద్దరు ఈసీలు ‘సర్‌’పై అభ్యంతరాలు తెలిపినట్లు వార్తల నేపథ్యంలో వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) వివాదం మరోసారి ముదురుతోంది. ‘సర్‌’ సహా ఓటర్ల తొలగింపు, చేర్పు వంటి కీలక నిర్ణయాలపై ఎన్నికల సంఘం కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు దీనికి ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత ఓటర్ల జాబితాతో బెంగాల్‌లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ను అరెస్ట్‌ చేయాలని కోరారు. 

జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా ఉన్నంతకాలం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. ఈ అంశంపై ఇండియా కూటమి భాగస్వామ్యాలతో చర్చించామన్నారు. త్వరలో సమావేశం అవుతామని తెలిపారు. 

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు బెంగాల్‌ ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. హర్యానా, బీహార్‌లోనూ ఇలాంటి చర్యలు జరిగాయని అన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి, ఎన్నికల సంఘం వ్యవహారాలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. ‘సర్‌’ సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది. అధికారులు చర్చల సమయంలో వివిధ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని తెలిపింది. ఓటర్ల హక్కులను కాపాడేందుకే ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది.
Advertisement
Mamata Banerjee
West Bengal Assembly Elections
Gyanesh Kumar CEC
Voter List Controversy
Trinamool Congress TMC
Election Commission of India

More Telugu News