జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బొత్స అనూష

జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బొత్స అనూష

Botsa Anusha meets Jagan Mohan Reddy
  • భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అనూష నియామకం
  • తనకు నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన అనూష
  • ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడతానని వ్యాఖ్య

వైసీపీ అధినేత జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ నూతన సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె జగన్ తో సమావేశమయ్యారు. ఇటీవలే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషను పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీని వీడటంతో, స్థానిక క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేసే బాధ్యతను జగన్ ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతను కట్టబెట్టినందుకు పార్టీ అధినేత జగన్‌కు అనూష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


భేటీ అనంతరం అనూష మాట్లాడుతూ... నియోజకవర్గంలో వై‌సీపీ బలోపేతానికి, శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు.

Advertisement
Botsa Anusha
YS Jagan Mohan Reddy
YSRCP
Bheemili Constituency
Botsa Satyanarayana
Andhra Pradesh Politics

More Telugu News